LOADING...
Train Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు 
బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు

Train Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 12, 2023
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

బిహార్ లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం సాయంత్రం నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో నలుగురు వ్యక్తులు మరణించగా, 70 మంది గాయపడినట్లు వార్తా సంస్థ PTI నివేదించింది. దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి వస్తున్న నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ అస్సాంలోని గౌహతిలోని కామాఖ్య జంక్షన్‌కు వెళ్తుండగా రాత్రి 9:53 గంటలకు రైలు ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి. కనీసం రెండు ఏసీ 3 టైర్ కోచ్‌లు బోల్తా పడగా, మరో నాలుగు కోచ్‌లు ట్రాక్‌లపైకి దూకినట్లు మీడియా విజువల్స్ చూపించాయి.

Details 

 సంఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు 

''రైలు నంబర్ 12506 (ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి కామాఖ్య) రఘునాథ్‌పూర్ స్టేషన్ ప్రధాన లైన్ గుండా వెళుతోంది. ఆరు కోచ్‌లు పట్టాలు తప్పాయి'' అని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మరణించారని బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) మనీష్ కుమార్ వార్తా సంస్థ పిటిఐకి తెలిపారు. కనీసం 70 మంది ప్రయాణికులు గాయపడ్డారని, వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించారని రైల్వే పోలీసు ఫోర్స్ అధికారి తెలిపారు. తీవ్ర గాయాలపాలైన వారిని పాట్నాలోని ఎయిమ్స్‌కు తరలించారు. సంఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు, అంబులెన్స్‌లు, వైద్యులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

Details 

21 రైళ్లను దారి మల్లింపు

ఢిల్లీ,దిబ్రూగఢ్ మధ్య రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సహా కనీసం 21 రైళ్లను దారి మళ్లించారు. కాశీ పాట్నా జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (15125),పాట్నా కాశీ జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (15126),రెండు రైళ్లు కూడా రద్దు చేసినట్లు తూర్పు మధ్య రైల్వే జోన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాద ఘటన పై స్థానికుడు ఒకరు మీడియా తో మాట్లాడుతూ,రైలు సాధారణ వేగంతో వస్తుండగా అకస్మాత్తుగా ఓ పెద్ద శబ్దం వినిపించింది. ఇంతలో రైలు నుండి పొగలు వచ్చాయి, వెంటనే ఏమి జరిగిందో చూడటానికి మేము అటు వైపు పరుగెత్తాము. అప్పటికే రైలు పట్టాలు తప్పాయి. AC కోచ్‌లు ఎక్కువగా దెబ్బతిన్నాయని తెలిపారు.

Advertisement

Details 

సహాయక కార్యక్రమమాలలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్

కోచ్‌ల పర్యవేక్షణ,ముందస్తు పునరుద్ధరణ కోసం వార్‌రూమ్‌లను ఏర్పాటు చేశామని, రెస్క్యూ ఆపరేషన్‌లు పూర్తి స్వింగ్‌లో కొనసాగుతున్నాయని రైల్వే అధికారి తెలిపారు. రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో యుద్ధప్రాతిపదికన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జిల్లా యంత్రాంగం, రైల్వే అధికారులు, స్థానికులు కలిసి సహాయ కార్యక్రమాలు చేపట్టారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. బక్సర్ ఎంపీ, కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే రైలు పట్టాలు తప్పినట్లు సమాచారం అందిందని, రఘునాథ్‌పూర్‌కు వెళుతున్నామని చెప్పారు. ఈ ఘటనపై రైల్వే, జిల్లా అధికారులతో మాట్లాడినట్లు వార్తా సంస్థ ANI నివేదించింది.

Advertisement

Details 

రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్ల విడుదల

విపత్తు నిర్వహణ విభాగం, బక్సర్, భోజ్‌పూర్ ఆరోగ్య శాఖ అధికారులతో తాను మాట్లాడినట్లు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ తెలిపారు. వీలైనంత త్వరగా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు తగిన వైద్య ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్ CPRO బీరేంద్ర కుమార్ వార్తా సంస్థ PTI తో మాట్లాడుతూ,రైలు బక్సర్ స్టేషన్ నుండి బయలుదేరిన అరగంట లోపే ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాదం నేపథ్యంలో రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేసింది. Patna Junction (PBE)- 9771449971 Danapur (DNR)- 8905697493 Ara- 8306182542 COML CNL- 7759070004 Pandit Deen Dayal Upadhyay Junction- 9794849461, 8081206628

Advertisement