
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో 27విమానాశ్రయాలు మూసివేత.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్..
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దాడులు జరిపిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాలతో భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
ఈ పరిస్థితుల్లో గగనతల భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.
ఫలితంగా దేశంలోని ఉత్తర మరియు పశ్చిమ ప్రాంతాల్లోని 27 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసారు.
ఈ ఆంక్షలు మే 10 వరకు అమల్లో ఉండనున్నాయి. దీనివల్ల గురువారం నాడు దేశవ్యాప్తంగా 430 విమానాల రద్దయ్యాయి.
వివరాలు
430 విమానాల రద్దు
గురువారం భారతీయ విమానయాన సంస్థలు మొత్తంగా 430 విమానాలను రద్దు చేశాయి.
ఇది దేశ వ్యాప్తంగా షెడ్యూల్ చేసిన విమానాలలో సుమారు 3 శాతం. ఇదే సమయంలో పాకిస్థాన్ విమానయాన సంస్థలు 147 విమానాలను రద్దు చేశాయి, ఇది వారి మొత్తం షెడ్యూల్ చేసిన విమానాలలో 17 శాతానికి సమానం.
ఫ్లైట్‌రాడార్24 నుంచి లభించిన సమాచారం ప్రకారం, పాకిస్థాన్, కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు వ్యాపించి ఉన్న భారతదేశ పశ్చిమ గగన మార్గంపై పౌర విమానాల రాకపోకలు నిలిపివేశారు.
ఈ మార్గాన్ని చాలా విమానయాన సంస్థలు సున్నిత ప్రాంతంగా పరిగణించి తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేశాయని పేర్కొన్నారు.
వివరాలు
తాత్కాలికంగా మూసివేసిన విమానాశ్రయాలు ఇవే..
శ్రీనగర్, జమ్మూ, లేహ్, చండీగఢ్, అమృత్‌సర్, లూథియానా, పాటియాలా, బటిండా, హల్వారా, పఠాన్‌కోట్, భుంటార్, సిమ్లా, గగ్గల్, ధర్మశాల, కిషన్‌గఢ్, జైసల్మేర్, జోధ్‌పూర్, బికనీర్, ముంద్రా, జామ్‌నగర్, రాజ్‌కోట్, పోర్‌బందర్, కాండ్లా, కేషోద్, భూర్జ్, గ్వాలియర్, హిండన్ విమానాశ్రయాలు తాత్కాలికంగా మూసివేశారు.