Page Loader
Tamilnadu: తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి
స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి

Tamilnadu: తమిళనాడులోని కడలూరులో ఘోర ప్రమాదం.. స్కూల్‌ వ్యాన్‌ను ఢీకొట్టిన రైలు.. ముగ్గురు చిన్నారు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులను తరలిస్తున్న ఒక స్కూల్ వ్యాన్, సెమ్మంగుప్పం వద్ద రైల్వే పట్టాలను దాటే సమయంలో వేగంగా వచ్చిన రైలు తాకింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇంకా 12 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. గాయపడిన పిల్లలను స్థానికులు, పోలీసులు సహాయంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రైలు చేరే సమయంలో రైల్వే గేటు వేయకపోవడంతో ఈ విషాదకర సంఘటనకు ప్రధాన కారణంగా గుర్తించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కడలూరులో ఘోర ప్రమాదం