Page Loader
Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు
4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు

Earthquake: 4.1 తీవ్రతతో మేఘాలయలో భూకంపం.. గంటల వ్యవధిలోనే రెండుసార్లు ప్రకంపనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2025
12:50 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ (Meghalaya)లో భూకంపం (Earthquake) సంభవించింది. గారో హిల్స్‌ (North Garo Hills) ప్రాంతంలో గురువారం ఉదయం 11:32 గంటలకు భూమి కంపించింది. రిక్టరు స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. భూకంప కేంద్రాన్ని భూమికి 5 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ప్రకంపనలు స్వల్ప స్థాయిలోనే ఉన్నప్పటికీ, ప్రాణ, ఆస్తి నష్టం జరుగలేదు. అయితే, ఈ భూకంపంతో ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, బుధవారం రాత్రి కూడా మేఘాలయలో భూకంపం సంభవించింది. కొద్ది గంటల వ్యవధిలో మరోసారి భూకంపం సంభవించడంతో ప్రజలు భయంతో ఉలిక్కిపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలోజి చేసిన ట్వీట్