Page Loader
JK Polls: రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్.. పోలింగ్ సెంటర్ల దగ్గర బలగాలు మోహరింపు
రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్

JK Polls: రేపే జమ్మూకాశ్మీర్‌లో తుది విడత పోలింగ్.. పోలింగ్ సెంటర్ల దగ్గర బలగాలు మోహరింపు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2024
05:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరగనున్న చివరి పోలింగ్‌తో మొత్తం మూడు విడతల ఓటింగ్ పూర్తవుతుంది. పోలింగ్ సిబ్బంది ఈవీఎంలతో పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు. మరోవైపు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా బలగాలు భారీగా మోహరించబడ్డాయి. ఓటర్లు ధైర్యంగా ఓటు వేయటానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

వివరాలు 

ఈవీఎంలతో పోలింగ్ బూతులకు చేరిన సిబ్బంది 

జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 18 మరియు 25 తేదీల్లో 50 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. అక్టోబర్ 1న 40 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. రెండు విడతల పోలింగ్ ప్రశాంతంగా, ఎలాంటి గొడవలు లేకుండా కూల్‌గా ముగిసింది. మంగళవారం జరగనున్న పోలింగ్ కోసం కూడా అధికారులు అన్ని అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు అన్ని విధాలా వసతులు కల్పించడం జరిగింది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మూడో దశలో 40 నియోజకవర్గాలకు పోలింగ్