Building Collapsed: కోల్ కత్తా లో కుప్పకూలిన భవనం, 10మందిని రక్షించిన సహాయక సిబ్బంది
కోల్‌కతాలోని కార్టర్ రీచ్ ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న ఐదు అంతస్థుల భవనం కూలిపోయిందని పశ్చిమ బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇన్‌ఛార్జ్ డైరెక్టర్ అభిజిత్ పాండే తెలిపారు. 6నెలలుగా ఈ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా గత అర్ధరాత్రి భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల క్రింద చాల మంది చిక్కుకున్నారు. తొలుత 10మందిని సహాయక సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ ఇంకా కొనసాగుతోందని అధికారి తెలిపారు. సరైన అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు.