
Fake Aadhaar Cards: మిలటరీ ఇంటిలిజెన్స్ రిపోర్ట్.. కేరళలో నకిలీ ఆధార్ కార్డులు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో నకిలీ ఆధార్ కార్డులు కలకలం రేపుతున్నాయి. మయన్మార్ కు చెందిన 50,000 వేల మంది శరణార్థుల వద్ద నకిలీ ఆధార్ కార్డులు ఉన్నట్లు మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ లోని ఆధార్ కేంద్రాల్లో ఈ నకిలీ కార్డులను సృష్టిస్తున్నట్లు తెలిపింది.
విదేశీయులు అక్రమంగా కేరళలోకి చొరబడుతున్నట్లు ఏడాది క్రితమే కేంద్రా నిఘా వర్గాలు వెల్లడించాయి.
బెంగాల్, జార్ఖండ్ నుండి ఐపి అడ్రెస్ లతో కేరళలో ఆధార్ కేంద్రాలను హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది.
Details
నకిలీ కార్డు కలిగిన వారికి మూడేళ్లు జైలు లేదా లక్ష జరిమాన
మిలిటరీ ఇంటిలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిఘాను పెంచారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోనూ నిఘా ఉంది. కేరళ పోలీసులు ఇవాళ వందల సంఖ్యలో నకిలీ ఆధార్ కార్డులు సీజ్ చేశారు.
నకిలీ ఆధార్ కార్డు అంశం కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి అని పలువురు సూచిస్తున్నారు.
ఆధార్ చట్టం ప్రకారం నకిలీ కార్డు కలిగిన వారికి మూడేళ్లు జైలు లేదా లక్ష జరిమాన విధించే అవకాశాలు ఉన్నాయి.