Nagpur riots:నాగ్‌పూర్ అల్లర్ల సూత్రధారి ఫాహిమ్ ఖాన్‌తో సహా 60 మంది అరెస్టు
ఈ వార్తాకథనం ఏంటి
నాగపూర్ మొఘల్ పాలకుడు ఔరంగజేబు సమాధి వివాదం నేపథ్యంలో తీవ్ర మత ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఈ అల్లర్లలో ముఖ్యంగా ఒక వర్గం ఇళ్లను, వ్యాపారాలను టార్గెట్ చేస్తూ కొందరు ముస్లిం మూక దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలకు సంబంధించి ప్రధాన సూత్రధారి ఫహీమ్ ఖాన్‌ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
మైనారిటీ డెమోక్రటిక్ పార్టీకి చెందిన స్థానిక రాజకీయ నాయకుడైన ఇతనిని శుక్రవారం వరకు కస్టడీలోకి తరలించారు. ఈ మత ఘర్షణలతో సంబంధం ఉన్న 60 మందిని అరెస్ట్ చేశారు.
Details
1200 మందిపై ఫిర్యాదులు
ఈ అల్లర్లకు కారణం ఒక వ్యక్తి లేదా సంస్థేనా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 6 కేసులు నమోదయ్యాయి. 1200 మందిపై ఫిర్యాదులు అందాయి.
ఇందులో 200 మందికంటే తక్కువ మంది పేర్లు నమోదు కాగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఔరంగజేబు మసీదు తొలగింపు డిమాండ్
ఛత్రపతి శంభాజీ నగర్ (ఔరంగాబాద్)లో ఉన్న ఔరంగజేబు మసీదును తొలగించాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి.
ఈ కార్యక్రమంలో పవిత్ర వ్యాఖ్యలు కలిగిన వస్త్రాన్ని తగలబెట్టారనే పుకార్లు రావడంతో, నమాజ్ ముగిసిన తర్వాత 250 మంది నినాదాలు చేస్తూ అల్లర్లను ప్రారంభించారు.
ప్రజలు వాహనాలకు నిప్పంటించారు, పోలీసులు, స్థానికులపై రాళ్లతో దాడి చేశారు.
Details
ముందస్తు కుట్రగా హింస
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే మంగళవారం మాట్లాడుతూ ఈ హింస ముందస్తు కుట్ర అని అభివర్ణించారు.
ఒక వర్గం వారి ఆస్తులు, ఇళ్లను టార్గెట్ చేస్తూ దాడులు చేశారని తెలిపారు.
ఈ ఘర్షణలకు బలమైన ప్రేరణగా నిలిచిందని భావిస్తోన్న "ఛావా" సినిమా విడుదల తర్వాత మహారాష్ట్ర అంతటా భావోద్వేగాలు పెరిగాయని, దీంతో ఔరంగజేబు మసీదు తొలగింపుపై డిమాండ్ పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.