Tamil Nadu: తమిళనాడు బిఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అనుమానితుల అరెస్టు
బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్పీ) తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్య కేసులో 8 మంది అనుమానితుల అరెస్టు చేసినట్లు చెన్నై అదనపు కమిషనర్ (నార్త్) అస్రా గార్గ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం పెరంబూర్ ప్రాంతంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించేందుకు ఆర్మ్‌స్ట్రాంగ్ వెళ్లారు. అప్పుడే బైక్‌లపై వచ్చిన ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేశారు. దాడి చేసిన వారిలో నలుగురు ఫుడ్ డెలివరీ ఏంజెట్లు దుస్తులు ధరించినట్లు తెలిసింది. పోలీసులు స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజ్‌ను సేకరించి నిందితుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే.. దాడి తర్వాత ఆర్మ్‌స్ట్రాంగ్ తీవ్ర గాయాలపాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు. రాజకీయంగా పెను దుమారం రేపింది ఈ హత్య.
ప్రతీకార హత్యే ఇది
ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రతీకారంతో జరిగిన హత్యగా తెలుస్తోంది.గత ఏడాది చెన్నైలో ఆర్కాట్ సురేష్ అనే హిస్టరీ షీటర్ హత్యకు గురయ్యాడు. ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యలో అరెస్టయిన ఎనిమిది మంది ఆర్కాట్ సురేష్ బంధువులు , ముఠా సభ్యులు అని సీనియర్ అధికారి ఒకరు ఇండియా టుడేకి చెప్పారు. నిజానికి ఆరోపణలు ఎదుర్కొంటున్న పొన్నై బాలా ఆర్కాట్ సురేష్ సోదరుడు. ఆర్కాట్ సురేష్ హత్యలో ఆర్మ్‌స్ట్రాంగ్ పాత్ర ఉందని నిందితులు నమ్ముతున్నారు. చెన్నై అదనపు కమిషనర్ (నార్త్) అస్రా గార్గ్ ప్రకారం, హత్య వెనుక గల కారణాలను నిర్ధారించడానికి అరెస్టు చేసిన నిందితులను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఆర్మ్‌స్ట్రాంగ్‌ను హత్య చేసిన నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి.
బైక్‌పై వచ్చిన హంతకులు
చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని ఆయన నివాసం సమీపంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. బైక్‌పై వచ్చిన గుర్తుతెలియని గుంపు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేసి రోడ్డుపై తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. దాడి తరువాత, ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు ప్రకటించారు. హతుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు.
ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యతో దిగ్భ్రాంతికి గురైన రాహుల్ గాంధీ
త్వరితగతిన నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించానని పేర్కొన్నారు. నిందితులను చట్ట ప్రకారం శిక్షించండి' అని స్టాలిన్ ట్వీట్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్యతో తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ ఘటనపై బీజేపీ నేత అమిత్ మాల్వియా కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఆపార్టీ మనుగడకోసం డి. ఎంకేపై ఆధారపడి ఉందని అన్నారు.అందుకే కాంగ్రెస్ నేత మౌనంగా వుండిపోయారని దుయ్యబట్టారు.