Page Loader
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి 
లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి

లద్దాఖ్: వాహనం లోయలో పడి 9మంది ఆర్మీ సిబ్బంది మృతి 

వ్రాసిన వారు Stalin
Aug 20, 2023
07:07 pm

ఈ వార్తాకథనం ఏంటి

లద్దాఖ్‌లోని లేహ్ జిల్లాలో ఆర్మీ వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడింది. దీంతో 9మంది సైనికులు మరణించారని రక్షణ అధికారులు వెల్లడించారు. మరో అధికారి గాయపడినట్లు వారు తెలిపారు. మృతుల్లో ఎనిమిది మంది సైనికులు, ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీఓ) ఉన్నారు. కియారీ పట్టణానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం కరూ పట్టణంలోని దండు నుంచి ఆర్మీ డివిజనల్ ప్రధాన కార్యాలయం ఉన్న తూర్పు లడఖ్‌లోని క్యారీకి వెళ్తోంది. ఆ సమయంలో ట్రక్కులో 10మంది ఉన్నారు. మొత్తం 34 మంది సైనికులతో వెళ్తున్న మూడు వాహనాల కాన్వాయ్‌లో భాగంగా ఈ ట్రక్కు ఉంది.

ఆర్మీ

నరేంద్ర మోదీ సంతాపం

మృతుల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ తన సంతాపాన్ని ప్రకటించారు. లేహ్ సమీపంలో జరిగిన దుర్ఘటనలో జవాన్లను కోల్పోవడం బాధాకరమని మోదీ పేర్కొన్నారు. దేశానికి వారు చేసిన గొప్ప సేవ ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. వాహనం లోయలో పడటంతో అందరం వీర సైనికులను కోల్పోయినట్లు చెప్పారు. సైనికుల మృతిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా స్పందించారు. లేహ్ సమీపంలో జరిగిన ప్రమాదంలో భారత ఆర్మీ సిబ్బందిని కోల్పోయినందుకు బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలిపారు. జవాన్లు వీరమరణం చాలా బాధాకరం అన్నారు. అమరవీరులందరికీ నివాళులర్పించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పీఎంఓ చేసిన ట్వీట్