
KIA: పెనుకొండ కియా పరిశ్రమలో పెద్ద ఎత్తున కారు ఇంజిన్లు మాయం
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండకు చెందిన కియా పరిశ్రమలో అనేక కారు ఇంజిన్లు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మార్చి 19న, సుమారు 900 ఇంజిన్లు కనిపించకుండా పోయాయని కంపెనీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇంజిన్‌లు మాయమవుతున్న విషయంపై యాజమాన్యం ముందుగా పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయకుండా, ప్రత్యక్షంగా దర్యాప్తు ప్రారంభించాలని కోరింది.
అయితే, ఫిర్యాదు లేకుండా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని పోలీసులు స్పష్టం చేశారు.
దాంతో, కియా ప్రతినిధులు అధికారికంగా ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు విచారణ ప్రారంభించారు. విచారణ కోసం పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
వివరాలు
తుదిదశకు కేసు దర్యాప్తు
కియా సంస్థకు అవసరమైన విడి భాగాలు విభిన్న ప్రాంతాల నుండి సరఫరా అవుతుంటాయి.
ఇందులో భాగంగా, కారు ఇంజిన్లు తమిళనాడు నుండి వస్తున్నాయి. ఆ మార్గంలో ఎక్కడైనా చోరీ జరిగిందా? లేక పరిశ్రమకు చేరిన తర్వాతే అవి దొంగిలించబడాయా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
ఇప్పటికే కేసు దర్యాప్తు తుదిదశకు చేరినట్టు సమాచారం. త్వరలో అధికారికంగా మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.