BJP leader killed: కర్నూలు జిల్లాలో బీజేపీ నేతను గొంతు కోసిన చంపిన దుండగులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 19, 2024
10:00 am
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లాలో బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. ఆదోని మండలం పెద్దహరివాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంటి ముందు నిద్రిస్తున్న శేఖన్న(50)ను దుండగులు గొంతు కోసి చంపారు. ఇటీవలే శేకన్న వైసీపీ పార్టీకి రాజీనామా చేసి, బీజేపీలో చేరారు. శేఖన్నకు గ్రామంలో ఎలాంటి విభేదాలేవని, ఆయన్ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికీ లేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న డీఎస్పీ సోమన్న, తాలుకా సీఐ నల్లప్ప కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.