ఉత్తర్‌ప్రదేశ్: బుదౌన్‌లో బస్సు-వ్యాన్ ఢీ.. ఐదుగురు పాఠశాల విద్యార్థులు, డ్రైవర్ మృతి
ఉత్తర్‌ప్రదేశ్ లోని బుదౌన్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, స్కూల్ వ్యాన్ డ్రైవర్ మృతి చెందారు. సోమవారం నబీగంజ్ రోడ్డులో స్కూల్ బస్సు, స్కూల్ వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్ డ్రైవర్, విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన 16 మంది విద్యార్థులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురు చికిత్స పొందుతూ మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య ఏడుకు చేరుకుంది. సమీపంలోని మియాన్ గ్రామం నుండి ఎస్‌ఆర్‌పి ఇంగ్లీష్ స్కూల్‌కు విద్యార్థులను తీసుకెళ్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
మరణాలను ధృవీకరించిన జిల్లా మేజిస్ట్రేట్
ఉసావాన్ పోలీస్ స్టేషన్ అధికారులు ప్రమాదం జరిగిన తీరుపై వివరాలు సేకరించారు. జిల్లా ఆసుపత్రికి చేరుకున్న జిల్లా మేజిస్ట్రేట్ (డిఎం) మనోజ్ కుమార్ ప్రాథమిక మరణాలను ధృవీకరించారు. గాయపడిన విద్యార్థులకు సరైన వైద్యం అందించాలని ఆసుపత్రి అధికారులను కోరినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను, ఖచ్చితమైన పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.