
Doctor| ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం.. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. డాక్టర్ ఆత్మహత్య
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని రాయ్‌బరేలీలోని రైల్వేస్ కాలనీలో రైల్వేలో పనిచేస్తున్న ఓ వైద్యుడు తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆపై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
డాక్టర్ అరుణ్ కుమార్,రాయ్ బరేలీలోని మోడరన్ రైల్ కోచ్ ఫ్యాక్టరీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
అతను డిప్రెషన్‌తో బాధపడ్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మిర్జాపూర్‌లో నివాసముంటున్న డాక్టర్ కుమార్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రాయ్‌బరేలీలోని రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్నాడు.
వారు చివరిసారిగా ఆదివారం కనిపించారు. ఆ తర్వాత రెండు రోజులుగా వారు రాకపోవడంతో వైద్యుని సహచరులు ఆయన ఇంటికి వెళ్లారు.
బెల్ కొట్టినా స్పందన లేకపోవడంతో తలుపులు పగులగొట్టారు. లోపల డాక్టర్, అతని భార్య అర్చన, కుమార్తె ఆదివా (12), కుమారుడు ఆరవ్ (4)మృతదేహాలు ఉన్నాయి.
Details
ఉరి వేసుకుని చనిపోయిన డాక్టర్
పోలీసులకు సమాచారం అందించగా జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఘటనా స్థలంలో సుత్తి, రక్తపు మరకలు, మందు ఇంజెక్షన్లు లభించాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్యుడు తన భార్య, పిల్లలకు స్పృహ కోల్పోవడానికి మందులు ఇచ్చాడు. ఆపై వారి తలపై కొట్టి చంపాడు.
అనంతరం డాక్టర్ అతని మణికట్టును కోసుకోడానికి ప్రయత్నించాడు. అది కుదరకపోవడంతో ఉరి వేసుకుని చనిపోయాడు.
పోస్ట్‌మార్టం అయ్యాక మరిన్ని విషయాలు వెల్లడి అవుతాయని రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు.
ఘటనా స్థలానికి లక్నో రేంజ్ ఐజీ తరుణ్ గౌబా చేరుకున్నారు. కొంతమంది పొరుగువారు, సహోద్యోగుల నుండి డాక్టర్ కుమార్ గురించిన సమాచారం సేకరించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.