తదుపరి వార్తా కథనం

UttarPradesh: కూరగాయల మండిలో భారీ అగ్నిప్రమాదం
వ్రాసిన వారు
Sirish Praharaju
Nov 23, 2023
10:55 am
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ లోని ఇటావాలో బుధవారం రాత్రి నవీన్ కూరగాయల మండిలో మంటలు చెలరేగాయని సీనియర్ అధికారి తెలిపారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
నవీన్ కూరగాయల మార్కెట్‌లో మంటలు చెలరేగినట్లు రాత్రి 10 గంటలకు సమాచారం అందిందని,10 నిమిషాల్లో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఇటావా అదనపు జిల్లా మేజిస్ట్రేట్ అభినవ్ రంజన్ సింగ్ తెలిపారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కూరగాయల మండిలో భారీ అగ్నిప్రమాదం
VIDEO | Several shops were gutted in a fire that broke out in a fruit market in UP's Etawah late last night. pic.twitter.com/o9IoUAsBGe
— Press Trust of India (@PTI_News) November 23, 2023