మణిపూర్‌లో మళ్లీ పేలిన గన్.. పాఠశాల బయట మహిళ కాల్చివేత
మణిపూర్‌లో మళ్లీ హింస చేలరేగింది. పాఠశాల బయట ఓ మహిళను అతి దారుణంగా కాల్చి చంపేశారు. ఇంపాల్ పశ్చిమ జిల్లాలోని స్థానిక శిశు నిష్తా నికేషన్ స్కూల్ ఎదుట ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు, వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మణిపూర్‌లో అల్లర్ల కారణంగా రెండు నెలల విద్యా సంస్థలు బంద్ అయ్యాయి. జులై 5న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను తిరిగి తెరిచారు. తాజాగా పాఠశాల బయట మహిళను చంపేయడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మణిపూర్‌లో మే3వ తేదీ నుండి ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.
జావాన్ ఇంటిని తగలబెట్టిన అల్లరిమూక
థౌబల్ జిల్లాలో ఇండియన్ రిజర్వ్ బెటాలియన్‌కు చెందిన ఓ జవాను ఇంటిని నిన్న అల్లరిమూక దహనం చేసింది. మరో వైపు వంగ్బాల్ వద్ద ఉన్న మూడో ఐఆర్‌బీ క్యాంపులోకి చొరబడి ఆయుధాలను లూటీ చేసేందుకు మంగళవారం రాత్రి సూమారుగా 800 గుంపుగా వచ్చిన విషయం తెలిసిందే. వీరిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో ఓ యువకుడు మరణించాడు. ఇంటర్నెట్ నిషేధానికి సంబంధించి మణిపూర్ హైకోర్టు ఇప్పటికే విచారణ జరిపింది. రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించాలా వద్దా అన్నదానిపై ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అయితే ఈ వ్యవహారంపై తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.