Page Loader
KTR: నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 

KTR: నేడు కేటీఆర్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2025
08:51 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ మంత్రి, భారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) పిటిషన్‌పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగనుంది. ఈ నెల 8న ఫార్ములా-ఈ కారు రేసు సందర్భంగా ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఏసీబీ నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ ఇటీవల కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, హైకోర్టు దీనిని తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ ప్రసన్న వర్లే ధర్మాసనం విచారణ జరపనుంది. ఇదిలా ఉంటే, సుప్రీంకోర్టులో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏసీబీ కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుప్రీంలో Special Leave Petition దాఖలు చేసిన కేటీఆర్