Page Loader
Jharkhand: జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీతా సోరెన్ చూపు జేఎంఎం వైపు? 
జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీతా సోరెన్ చూపు జేఎంఎం వైపు?

Jharkhand: జార్ఖండ్‌ రాజకీయాల్లో కీలక పరిణామం.. సీతా సోరెన్ చూపు జేఎంఎం వైపు? 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2025
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

జార్ఖండ్‌ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుసుంది. బీజేపీ మహిళా నేత సీతా సోరెన్ తిరిగి జెఎంఎంలో చేరే అవకాశంపై చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన సీతా సోరెన్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె తిరిగి జెఎంఎంలో చేరే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 2న దుమ్కాలో జెఎంఎం వ్యవస్థాపక దినోత్సవం జరగనుంది. ఇందులో పార్టీ తాత్కాలిక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పాల్గొననున్నారు. సీతా సోరెన్ జెఎంఎంలో చేరనున్నారనే వార్తల నడుమ ఆమెను ఈ విషయం గురించి అడిగారు. తాను ఫిబ్రవరి 1న దుమ్కాకు చేరుకుంటానని, కాలమే ఈ ప్రశ్నకు సమాధానం చెబుతుందన్నారు.

Details

తనకు ఎటువంటి సమాచారం లేదు : బసంత్ సోరెన్

సీతా సోరెన్ బీజేపీలో చేరిన తరువాత, జెఎంఎం ఎమ్మెల్యే, ఆమె బావమరిది బసంత్ సోరెన్ మాట్లాడారు. ఈ అంశంపై తనకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. వ్యవస్థాపక దినోత్సవం గురించి మాట్లాడుతూ, ఈ వేడుకల నిర్వహణపై పార్టీ కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహం ఉందని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు శిబూ సోరెన్‌ పెద్ద కోడలు సీతా సోరెన్ బీజేపీలో చేరి, దుమ్కా నుంచి పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆమె జెఎంఎం అభ్యర్థి నళిన్ సోరెన్ చేతిలో ఓడిపోయారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీతాకు జంతారా టిక్కెట్‌ కేటాయించింది, అయితే ఆమె మళ్లీ నిరాశను ఎదుర్కొన్నారు.