Madhyapradesh Elections: మధ్యప్రదేశ్‌లో నేడు పోలింగ్.. కీలక నియోజకవర్గంలో గెలుపు ఎవరిది?
మధ్యప్రదేశ్‌లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈరోజు జరుగుతుండగా, ప్రధాన పోరు కాంగ్రెస్-బీజేపీ మధ్యే నెలకొంది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ కమల్ నాథ్ సహా ఇరు పార్టీలకు చెందిన పలువురు ప్రముఖ నేతలు పోటీలో ఉన్నారు. బుద్ని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఆయన పార్టీ బరిలోకి దింపింది. ఆయనపై పోటీకి నటుడు విక్రమ్ మస్తాల్‌ను కాంగ్రెస్ పోటీకి దింపింది. విక్రమ్ (40) 2008 టీవీ సీరియల్ 'రామాయణ్ 2'లో 'హనుమాన్' పాత్రను పోషించారు.
జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు.. ప్రభుత్వంలోకి శివరాజ్ సింగ్ చౌహాన్
చింద్వారా అసెంబ్లీ నియోజకవర్గంలో,మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్,చింద్వారా జిల్లా భారతీయ జనతా యువమోర్చా మాజీ అధ్యక్షుడు, బిజెపికి చెందిన వివేక్ బంటీ సాహుపై తన సొంతగడ్డపై పోటీ చేస్తున్నారు. కమల్ నాథ్ 2019లో చింద్వారా నుంచి బీజేపీకి చెందిన సాహుపై 25,837 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మార్చి 2020లో జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటు చెయ్యడంతో ముఖ్యమంత్రిగా కమల్ నాథ్ పదవీకాలం ముగిసింది. అదే సమయంలో మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడానికి అవకాశం ఏర్పడింది.
ఇండోర్-1 లో గెలుపు ఎవరిది?
మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ కుమారుడు జైవర్ధన్ సింగ్ తమ కుటుంబానికి కంచు కోట అయిన రఘోఘర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అదే సమయంలో, జ్యోతిరాదిత్య సింధియా బీజేపీ శిబిరంలో చేరడంతో పోటీ రసవత్తరంగా మారింది. ఇప్పుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్న సింధియా, దిగ్విజయ్ సింగ్ బంధువు మూల్ సింగ్ కుమారుడు హీరేంద్ర సింగ్, అలియాస్ బంటి బన్నాను బీజేపీ శిబిరంలోకి రావడానికి ఒప్పించారు. బీజేపీ రఘోఘర్ నుంచి బంటి బన్నాని జైవర్ధన్ సింగ్‌పై పోటీకి దింపారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ ఇండోర్-1 నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఇండోర్ మాజీ మేయర్ సంజయ్ శుక్లాను బరిలోకి దింపింది.
పటేల్ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న నర్సింగాపూర్ లో గెలుపు ఎవరిది?
ఇండోర్-1 నియోజకవర్గం బీజేపీకి కంచుకోట, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారి ఇండోర్-1 నుంచి శుక్లా గెలవడంతో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. నర్సింగపూర్ నుంచి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ బరిలోకి దిగారు. ఒకే స్థానం నుంచి రెండుసార్లు గెలిచిన ఆయన సోదరుడు జలం సింగ్ పటేల్ స్థానంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నర్సింగ్‌పూర్‌లో ప్రహ్లాద్ సింగ్ పటేల్‌పై పోటీ చేయడానికి లఖన్‌సింగ్ పటేల్‌ను కాంగ్రెస్ రంగంలోకి దించింది. లఖన్ గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన జలం సింగ్ పటేల్ చేతిలో ఓడిపోయారు. పటేల్ సామాజికవర్గం ప్రాబల్యం ఉన్న నర్సింగాపూర్ ఈ ఎన్నికల్లో కేంద్ర బిందువుగా నిలుస్తోంది.
కాంగ్రెస్ కంచుకోట లహర్ లో బీజేపీ అడుగుపెడుతుందా?
మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దతియా స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. మాజీ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త అయిన నరోత్తమ్ మిశ్రా కాంగ్రెస్‌కు చెందిన అవధేష్ నాయక్‌తో పోటీపడుతున్నారు. బీజేపీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మిశ్రా 2018 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి భారతీ రాజేంద్రపై 72,209 ఓట్లతో విజయం సాధించారు. లాహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి గోవింద్ సింగ్‌పై పోటీ చేసేందుకు బీజేపీ అంబరీష్ శర్మను రంగంలోకి దించింది. లహర్ నుంచి వరుసగా ఏడు సార్లు విజయం సాధించిన రికార్డు సింగ్‌కు ఉంది. ఈ కాంగ్రెస్ కంచుకోటలో అడుగుపెట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.