మమతా బెనర్జీ నివాసంలోకి తుపాకీతో చొరబడేందుకు వ్యక్తి యత్నం
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఓ వ్యక్తి తుపాకితో చొరబడేందుకు ప్రతయ్నంచాడు. వెంటనే అప్రమ్తమైన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితో పాటు నిషేధిత వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని షేక్ నూర్ అలామ్ గా పోలీసులు గుర్తించారు.
నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్ అని స్టిక్కర్ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం వద్దకు చేరుకున్నాడు.
గన్, కత్తి కలిగిన అతడు భద్రతా లేన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు.
Details
ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు
పోలీసులు, స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్), స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ పేర్కొన్నారు. ఈ ఘటన జరిగినప్పుడు సీఎం మమతా బెనర్జీ ఆ నివాసంలో ఉన్నారన్నారు.
ప్రస్తుతం ఆ వ్యక్తి వద్ద గన్, కత్తి, మత్తు పదార్థాలతో పాటు కొన్ని భద్రతా ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కోల్‌కతాలో శుక్రవారం 'అమరవీరుల దినోత్సవం' ర్యాలీ నిర్వహించనున్నది.
ఈ ర్యాలీలో పాల్గొనేందుకు ఆమె తన నివాసం నుంచి బయలుదేరాల్సి ఉంది. ఇంతలో గన్, కత్తి కలిగిన వ్యక్తి భద్రతా లేన్‌లోకి ప్రవేశించడం ప్రస్తుతం కలకలం రేపింది.