LOADING...
Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఒక వ్యక్తికి పాజిటివ్
ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఒక వ్యక్తికి పాజిటివ్

Bird Flu: ఏపీలో బర్డ్‌ఫ్లూ కలకలం.. ఒక వ్యక్తికి పాజిటివ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
11:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ భయాందోళన కలిగిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మరణిస్తుండటం, తాజాగా ఓ వ్యక్తికి ఈ వైరస్‌ సోకడం కలకలం రేపుతోంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలానికి చెందిన వ్యక్తికి బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో లక్షలాది కోళ్లు మరణించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Details

ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాాలి

మృతి చెందిన కోళ్ల శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపగా, బర్డ్‌ఫ్లూ సోకినట్లు తేలింది. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారం, వేల్పూరులోనూ కోళ్ల నమూనాలను పరీక్షించగా, అవి కూడా బర్డ్‌ఫ్లూ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో అధికారులు అగ్రహారం పరిసరాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బర్డ్‌ఫ్లూ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో అధికారులు చికెన్‌ దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశించారు. వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలను హెచ్చరించారు.