Page Loader
Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు 
Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు

Spicejet: లాక్ పనిచేయకపోవడంతో విమానం టాయిలెట్‌లో ఇరుక్కపోయిన ప్రయాణికుడు 

వ్రాసిన వారు Stalin
Jan 17, 2024
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

స్పైస్‌జెట్‌ (Spicejet) ఎయిర్‌లైన్స్‌కు చెందిన ముంబై-బెంగళూరు విమానంలో ఓ ప్రయాణికుడు టాయిలెట్‌లో ఇరుక్కుపోయాడు. సాంకేతిక లోపంతో లాక్ పనిచేయకపోవడం వల్ల డోర్ తెరుచుకోకపోవడంతో 1.30 గంటలపాటు ఆ ప్రయాణికుడు బయటకు రాలేకపోయాడు. బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ కాగానే గ్రౌండ్ స్టాఫ్ టాయిలెట్ తలుపులు పగులగొట్టి ప్రయాణికుడిని బయటకు తీశారు. విమానం టాయిలెట్‌లో ప్రయాణికుడు ఇరుక్కుపోయిన ఈ ఘటన ఫ్లైట్ నంబర్ SG-268లో జరిగినట్లు ఎయిర్‌పోర్ట్ వర్గాలు తెలిపాయి.

స్పైస్ జెట్

మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన

SG-268 నంబర్ గల స్పైస్‌జెట్ విమానం మంగళవారం (జనవరి 16) తెల్లవారుజామున 2 గంటలకు ముంబై విమానాశ్రయం నుంచి బయలుదేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే, ప్రయాణికుడు తన సీటుబెల్ట్ తీసుకొని టాయిలెట్‌కు వెళ్లాడు. అయితే టాయిలెట్ డోర్‌లో లోపం కారణంగా లోపల ఇరుక్కుపోయాడు. తాను చిక్కుకుపోయామని ప్రయాణీకుడు సిబ్బందికి టాయిలెట్ లోపల నుంచి సమాచారం అందించాడు. దీంతో సిబ్బంది హడావుడిగా తలుపులు తీయడానికి ప్రయత్నించారు. కాని కుదరలేదు. దీంతో చేసేది ఏమీ లేక, ఆ ప్రయాణికుడు 1.30 గంటల పాటు టాయిలెట్‌లోనే ఉండిపోయాడు.