
Viveka murder case: వివేకా కేసు విచారణలో మలుపు.. సునీత, అల్లుడిపై ఉన్న కేసులను రద్దు చేసిన సుప్రీం కోర్టు!
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో కీలక విచారణ జరిగింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ ఎన్.కె. సింగ్‌ల ధర్మాసనం ఈ విచారణను చేపట్టింది. ఈసందర్భంగా వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అలాగే అప్పటి సీబీఐ విచారణాధికారి రాంసింగ్‌పై నమోదైన కేసులను రద్దు (క్వాష్) చేస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. సునీత తరఫున న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ - అవినాష్ సహా ప్రధాన నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును అభ్యర్థించారు. సుప్రీంకోర్టు విధించిన గడువు కారణంగానే దర్యాప్తు పూర్తి చేసిందని సీబీఐ చెబుతోందని అన్నారు. ఇంకా ఈ హత్య కేసులో మరింత లోతైన దర్యాప్తు అవసరం ఉందని స్పష్టం చేశారు.
Details
సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నం
అసలు సూత్రధారులు, కీలక పాత్రధారులు ఎవరో వెలుగులోకి రావాలని కోరారు. సాక్షులను బెదిరించే ప్రయత్నాలు, సాక్ష్యాలను ధ్వంసం చేసే చర్యలు జరుగుతున్నాయని కోర్టుకు వివరించారు. సునీత దంపతులు, రాంసింగ్‌పై కుట్రపూరితంగా కేసులు నమోదు చేశారని కూడా వాదించారు. ఈ వాదనలపై విచారణ అనంతరం, ఆ కేసులను ధర్మాసనం రద్దు చేసింది. సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదిస్తూ - "నిందితులను నిరవధికంగా జైలులో ఉంచడం సరైంది కాదు. కానీ హత్య జరిగిన తీరు చూస్తే, 2 లేదా 5 ఏళ్ల శిక్ష వారికి చాల తక్కువగా అనిపిస్తోంది. ఆధారాలు చెరిపివేయడం, సాక్ష్యాలను దాచిపెట్టడం స్పష్టంగా నిరూపితమైంది. మొదట ఇది గుండెపోటు వల్ల మరణమని ప్రచారం చేశారు.
Details
అప్రూవర్ దస్తగిరికి బెదిరింపులు
తర్వాత రక్తపు వాంతుల వల్ల మృతి అనీ ప్రచారం చేశారు. హత్య నిజం బయటపడకుండా అన్ని విధాలా ప్రయత్నించారు. కానీ దర్యాప్తులో అన్ని వివరాలు బహిర్గతమయ్యాయని కోర్టుకు వివరించారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హుజేఫా అహ్మదీ వాదనలు వినిపించారు. ఆయన మాట్లాడుతూ - నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి 'మెడికల్ క్యాంప్' పేరిట కడప జైలుకు వెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఫొటోలు సహా అన్ని రుజువులు దొరికాయని అన్నారు. జైలులో అప్రూవర్ దస్తగిరిని బెదిరించినట్లు కూడా సాక్ష్యాలు ఉన్నాయని కోర్టుకు వివరించారు. ఈ కేసులో నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సీబీఐ తరఫున వాదన వినిపించబడిందని పేర్కొన్నారు.