Page Loader
ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం 
ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం

ఆర్మీ జవాన్ భార్యపై వేధింపుల ఆరోపణలపై తమిళనాట దుమారం 

వ్రాసిన వారు Stalin
Jun 12, 2023
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో 40 మందికి పైగా జవాన్ భార్యపై వేధింపులకు పాల్పడిన ఘటన తీవ్ర దుమారాన్ని రేపుతోంది. కశ్మీర్‌లో హవిల్దార్‌గా పని చేస్తున్న తిరువణ్ణామలై జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ తన భార్యపై దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని అభ్యర్థిస్తూ వీడియో సందేశాన్ని విడుదల చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. జవాన్ భార్య ఆదివారం నాడు తనపై 40 మందికి పైగా దాడి చేసి వేధించారని, మాటలతో దూషించారని ఆరోపించారు. తనను కూడా అనుచితంగా తాకారని, తమ కుటుంబాన్ని ప్రశాంతంగా బతకనివ్వడం లేదని, బెదిరిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. సైనికుడి భార్య, కొంతమంది పురుషుల మధ్య భూమి లీజుకు సంబంధించిన వివాదం కేసు ఉందని పోలీసులు తెలిపారు.

ఆర్మీ

ఎవరూ వేధించలేదు: పోలీసులు

ఆమెకు డిపార్ట్‌మెంట్ రక్షణ కల్పించిందని పోలీసులు కూడా చెప్పారు. జవాన్ భార్యపై ఎవరూ దాడి చేయలేదని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. జవాన్ వీడియో విడుదల చేయడం అతిశయోక్తిగా ఉందని పోలీసులు వెల్లడించారు. జూన్ 10న తమిళంలో జవాన్ మాట్లాడిన వీడియోను రిటైర్డ్ ఆర్మీ అధికారి కల్నల్ త్యాగరాజన్ ట్విట్టర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. జవాన్ ఇచ్చిన ఫిర్యాదుపై సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తిరువణ్ణామలై ఎస్పీ కార్తికేయ తెలిపారు. నిందితుల్లో రాము, హరిప్రసాద్‌లను ఇప్పటికే అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ఇదిలా ఉంటే, జవాన్‌తో మాట్లాడినట్లు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై తెలిపారు. జవాన్ కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.