
Jaswant Singh Gajjan Majra: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అరెస్టు.. బహిరంగ సభలో నుంచి తీసుకెళ్లిన ఈడీ
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఈడీ సోమవారం అరెస్టు చేసింది.
మలేర్ కోట్లా జిల్లాలోని అమర్‌గఢ్ లో ఇవాళ ఉదయం ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతుండగా, అక్కడికి వచ్చిన ఈడీ అధికారులు ఆయన్ను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు.
గతేడాది నమోదైన ఓ లాండరింగ్ కేసులో ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
మీటింగ్ జరుగుతున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవడం బీజేపీ నైజాన్ని బయటపడిందని ఆప్ నేత మాల్విందర్ కంగ్ ఆరోపించారు.
ఇవాళ సాయంత్రం జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను మొహాలీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
Details
గతంలో జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాపై మనీలాండరింగ్ కేసు
రూ.41 కోట్ల బ్యాంకు ఫ్రాడ్ కేసులో సీబీఐ గతేడాది సెప్టెంబరులో జశ్వంత్ ఇంటితో పాటు మరికొన్ని చోట్ల సోదాలు చేసిన విషయం తెలిసిందే.
అప్పట్లో 17 లక్షల నగదు, విదేశీ కరెన్సీ, ప్రాపర్టీ డాక్యుమెంట్లను సీజ్ చేశారు.
లుథియానాలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో మజ్రాపై కేసు నమోదు చేశారు.
ఈ కేసులో విచారణ కోసం ఇటీవల మజ్రాకు ఈడీ నాలుగుసార్లు సమన్లు జారీ చేసింది.
అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తాజాగా ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.