Congress : పంజాబ్‌లో కూడా ఆప్‌కు భవిష్యత్తు లేనట్లే : కాంగ్రెస్
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనడంపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
దిల్లీలో ఏదో కొంత బలమైన స్థితిలో ఉండటంతోనే ఆప్‌కి కొన్ని సీట్లు వచ్చాయని, కానీ పంజాబ్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని పేర్కొంది.
2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లు కూడా దక్కడం కష్టమని పంజాబ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా అభిప్రాయపడ్డారు.
దిల్లీలో ఆప్ పరిస్థితి ఇప్పటికీ కొంత మేలని, అందువల్ల అక్కడ కొన్ని సీట్లు దక్కాయన్నారు.
Details
22 స్థానాలను మాత్రమే దక్కించుకున్న ఆప్
కానీ పంజాబ్‌లో ఆ పార్టీ పరిస్థితి మరింత క్షీణించిందన్నారు.
అందుకే 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం పాలై సింగిల్ డిజిట్ సీట్లు కూడా దక్కించుకోలేకపోయిందని అమరీందర్ సింగ్ రాజా వ్యాఖ్యానించారు.
ఇక దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 22 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.
మరోవైపు 48 స్థానాల్లో గెలుపొందిన బీజేపీ దిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకుంది.