Haryana Assembly Elections 2024: 20 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసిన ఆప్
హరియాణా అసెంబ్లీ ఎన్నికల సమయం ఆసన్నమవడంతో అక్కడ కీలకమైన రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీను ఓడించడం లక్ష్యంగా కాంగ్రెస్-ఆప్ కలిసి పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ, సీట్ల సర్దుబాటు వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభన ఆ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. ఈ పరిస్థితుల్లో ఆప్ ఒక కీలక నిర్ణయం తీసుకుని, సోమవారం మధ్యాహ్నం 20 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఇది కాంగ్రెస్-ఆప్ పొత్తుపై నీలినీడలు కమ్ముకొన్నాయి.
20 మంది అభ్యర్థులతో తొలి జాబితా
హర్యానాలో అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు దాఖలు చేసేందుకు సెప్టెంబర్ 12 వరకు గడువు ఉంది. కానీ, ఇరు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడంతో, ఆప్ 20 మంది అభ్యర్థులతో తన తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో హర్యానా ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా కలయాత్ నియోజకవర్గం నుంచి, భివానీ నుంచి శర్మ, మేహమ్ సీటు నుంచి వికాశ్ నెహ్రా, రోహ్‌తక్ నుంచి బిజేందర్ హుడా పేర్లు ఉన్నాయి. ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ గుప్తా మాట్లాడుతూ, సాయంత్రానికి సీట్ల వ్యవహారం ఖరారు కాకపోతే, అన్ని 90 స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు.
ఆప్ 10 సీట్లలో పోటీ చేయాలని భాసిస్తోంది
హర్యానా అసెంబ్లీకి మొత్తం 90 స్థానాలు ఉండగా, ఆప్ 10 సీట్లలో పోటీ చేయాలని భావించగా కాంగ్రెస్ పార్టీ 7 సీట్లు మాత్రమే కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. సీట్ల సర్దుబాటుపై ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో, ఆప్ తన అభ్యర్థుల జాబితాను ప్రకటించడం కీలకంగా మారింది.