Page Loader
Telangana: పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం
పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం

Telangana: పీజీ మెడికల్‌ సీట్లలో స్థానిక కోటా రద్దు... సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోరాటం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 11, 2025
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌పై పూర్తిస్థాయి విచారణకు అనుమతి ఇచ్చింది. ఇదే సందర్భంలో పీజీ మెడికల్ సీట్లలో స్థానికత కోటా అమలు చేయరాదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది.