Formula E Car Racing Case: నేడు ఫార్ములా ఈ కేసులో ఏసీబీ, ఈడీ విచారణ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
నేడు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణలో ఏసీబీ, ఈడీ కీలక పాత్ర పోషించనున్నాయి.
ఈ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరు కానున్నట్లు తెలిసింది. అదే విధంగా ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డు చేయనున్నారు.
ఇదే సమయంలో హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ కూడా ఈడీ రికార్డు చేయనుంది.
ఈ విచారణలు ఈరోజు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇక ఫార్ములా ఈ రేస్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, దీనిపై టీఆర్ఎస్ నేత కేటీఆర్ నిన్న మీడియాతో స్పందించారు.
Details
సుప్రీం కోర్టులో ఈ కేసుపై పోరాడుతా
చిన్నప్పటి నుంచి ఒక సామెత వింటున్నామని, అవినీతి పరులు ప్రతిచోటా అదే జరుగుతుందని అనుకుంటారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులు ఉదయం నుంచే హడావుడి చేస్తూ నాకెదురుగా లొట్టపీసు కేసు పెట్టారని తీవ్ర విమర్శలు చేశారు.
అవినీతి లేదని తెలిసినా తనపై ఈ కేసును పెట్టారని, ఇలా చేస్తూ శునకానందం పొందుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగపరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటానని స్పష్టం చేశారు.
తనపై కేసు పెట్టిన చిట్టి నాయుడుకి ఒక విషయం చెప్పాలనుందని, తాను ఏసీబీ ఆఫీసుకు వెళ్లినప్పుడు తమను ప్రశ్నించడానికి కూడా భయపడ్డారని వ్యాఖ్యానించారు.
కోర్టుకు వెళ్లి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసినా అది కొట్టివేశారన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ కేసుపై పోరాడతామని తెలిపారు.