Page Loader
Mamata Banerjee: కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలు 
Mamata Banerjee: కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలు

Mamata Banerjee: కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 24, 2024
04:14 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం బర్ధమాన్ నుండి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో ఆమె తలకు స్వల్ప గాయమైనట్లు తెలిపాయి. వర్షం కారణంగా మమతా బెనర్జీ కారులో కోల్‌కతా తిరిగి వస్తున్నారు. పొగమంచు ఎక్కువగా ఉండటంతో రహదారిపై ఏమి కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో మరో వాహనాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ముఖ్యమంత్రి గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కారు ప్రమాదంలో మమతా బెనర్జీ తలకు స్వల్ప గాయాలు