NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..  
    తదుపరి వార్తా కథనం
    Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..  
    డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..

    Vijay: డీఎంకే,బీజేపీపై టీవీకే విమర్శలు..'వన్ నేషన్, వన్ ఎలక్షన్' అప్రజాస్వామికం..  

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 03, 2024
    05:53 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'జమిలి' ఎన్నికల ప్రతిపాదనను ప్రముఖ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్‌ వ్యతిరేకించారు.

    దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేర్కొంటూ, ఈ చర్యను ఖండిస్తున్నట్లు వెల్లడించారు.

    తన పార్టీ జిల్లా కార్యాలయ ఆఫీస్ బేరర్లు, కార్యవర్గ సభ్యులతో ఆదివారం తొలిసారి సమావేశం నిర్వహించారు.

    ఈ సమావేశంలో టీవీకే సంస్థాగత బలోపేతం, ప్రజలకు చేరువయ్యే అంశాలపై చర్చించి 26 తీర్మానాలను ఆమోదించారు.

    వివరాలు 

    తమిళనాడు ప్రజల ఐక్యత, సామరస్యత కోసం టీవీకే

    ఈ సందర్భంగా విజయ్ డీఎంకే, బీజేపీ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. తమిళనాడులో శాంతి భద్రతల సమస్యలను ప్రస్తావించారు.

    అలాగే, కులగణన చేపట్టాలని, పరందూర్‌ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేయాలని, మద్యం దుకాణాలను క్రమంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

    కేంద్రంలోని బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వ తీరుపైనా విజయ్ విమర్శలు చేశారు.

    జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)రివ్యూలో ఉన్న వక్ఫ్ సవరణ బిల్లు-2024ను ఫెడరలిజంపై దాడిగా పేర్కొన్నారు.

    ఈ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.నీట్‌ను రద్దు చేయాలని, విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితాలోకి మార్చాలని కోరారు.

    చివరగా,తమ పార్టీ సిద్ధాంతం లౌకికవాదం,సామాజిక న్యాయం అని,తమిళనాడు ప్రజల ఐక్యత, సామరస్యత కోసం టీవీకే పనిచేస్తుందని విజయ్ స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తమిళనాడు

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తమిళనాడు

    Tamilnadu Viral Video: కొత్త కారుకు పూజ చేసే సమయంలో.. హఠాత్తుగా ఏం జరిగిందంటే..!  భారతదేశం
    Tamilnadu: 666 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో నిండిన ట్రక్కు బోల్తా .. దాన్ని గుమ్మికూడిన జనం  భారతదేశం
    Tamilnadu: తమిళనాడులోని బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 5 మంది మహిళలు సహా 8 మంది మృతి  భారతదేశం
    Narendra Modi: ఎన్నికల తరువాత ప్రధాని మోదీ ధ్యానం చేసేది ఇక్కడే..దీని ప్రత్యేకత ఏంటంటే..?  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025