
Mahapanchayat: ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో "మహాపంచాయత్"
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌కు చెందిన రైతులు గురువారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో మహాపంచాయత్‌ను నిర్వహించనున్నారు.
సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు రైతులు మహాపంచాయతీకి ముందు ఉచన నుంచి జింద్ వరకు పాదయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి సత్తా చాటేందుకు కృషి చేస్తామన్నారు.
ఇక, బుధవారం సాయంత్రానికే పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్,రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి వందలాది టాక్టర్లు,ట్రాలీలు దిల్లీకి చేరుకున్నాయి. అలాగే, రైళ్లలో కూడా వేలాది మంది దిల్లీకి చేరుకున్నారు.
కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక,వ్యవసాయ కార్మిక సంఘాలు,మహిళా సంఘాలు,విద్యార్థి సంఘాలు,యువజన సంఘాలు,ప్రజాస్వామిక సంఘాల లాంటి ఎస్‌కేఎం సమన్వయ సంఘాలతో సహా దేశంలోని రైతులు,వ్యవసాయ కార్మికులు,సామాన్య ప్రజల సైతం ఈ చారిత్రాత్మక మహాపంచాయత్‌ని విజయవంతం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా విజ్ఞప్తి చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నేడు ఢిల్లీలో "మహాపంచాయత్"
After A Month At Borders, Farmers To Enter Delhi Today For 'Mahapanchayat' https://t.co/sp9WTTrO0s pic.twitter.com/Gk613AMyBw
— NDTV News feed (@ndtvfeed) March 14, 2024