Ramesh Bidhuri: 'తండ్రినే' మార్చేసిన అతిషి మర్లెనా.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి నోటి దురుసు వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిదురి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి అతిషి మార్లెనా సింగ్‌పై ఆమె తండ్రిని మార్చేసిందంటూ నోటి దురుసు మాటలతో కొత్త వివాదం ప్రారంభించారు.
త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అధికారాన్ని సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి,ప్రచారంలో శ్రమిస్తున్నారు.
''ఆప్దా నహీ సాహేంగే, బాదల్ కే రహేంగే''అనే నినాదంతో ఢిల్లీ ప్రభుత్వంపై బీజేపీ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.
ఇదిలా ఉండగా,అన్ని పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటే, బీజేపీ అభ్యర్థి రమేష్ బిదురి మాత్రం వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు.
వివరాలు
నన్ను గెలిపిస్తే ప్రియాంక గాంధీ బుగ్గలలా సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తా'
ఇటీవల ఓటర్లను ప్రసన్నం చేయడానికి తన నియోజకవర్గ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పేరును తీసుకున్నారు.
''నన్ను గెలిపిస్తే ప్రియాంక గాంధీ బుగ్గలలా సుతిమెత్తని రోడ్లు నిర్మిస్తా'' అంటూ చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రతిపక్షాలు బీజేపీపై మండిపడగా, ఆయన క్షమాపణలు చెప్పారు.
అయితే, క్షమాపణలు చెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే సీఎం అభ్యర్థి అతిషిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆమె ఇంటి పేరు మార్పుపై దృష్టి పెట్టి, ఆమె తండ్రిని మార్చేసిందంటూ ఆరోపించారు.
దీనితో పాటు ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ అవినీతితో ఉన్న సంబంధాలను విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనని ఆప్ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణం చేశారంటూ ఎద్దేవా చేశారు.