Page Loader
Uttar Pradesh: పోర్న్ క్లిప్‌ని చూసి.. సోదరిపై అత్యాచారం చేసి,హత్య చేశాడు
Uttar Pradesh: పోర్న్ క్లిప్‌ని చూసి.. సోదరిపై అత్యాచారం చేసి,హత్య చేశాడు

Uttar Pradesh: పోర్న్ క్లిప్‌ని చూసి.. సోదరిపై అత్యాచారం చేసి,హత్య చేశాడు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 06, 2024
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లోని కస్‌గంజ్ జిల్లాలో 19 ఏళ్ల యువకుడు తన 17 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో అరెస్టయ్యాడు. సంజు అనే నిందితుడు తన మొబైల్ ఫోన్‌లో అశ్లీల వీడియో చూసిన త‌ర్వాత త‌న సోద‌రిపై అత్యాచారానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. నేరం జరిగిన రోజు అన్నాచెల్లెళ్లు ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. ఆ రోజు త‌ల్లి బంధువ‌ల ఇంటికి వెళ్ళింది.

Details 

జ్యుడీషియల్ కస్టడీకి సంజు 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోర్న్ క్లిప్ చూసిన సంజు.. పక్కనే నిద్రిస్తున్న సోదరిపై అత్యాచారం చేశాడు. తాను చేసిన పనిని బయటపెడుతుందేమోనన్న భయంతో సంజు తన సోదరిని గొంతు కోసి హత్య చేసి అక్కడి నుంచి పారిపోయాడు. సంజు నుంచి అశ్లీల వీడియోలతో కూడిన మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు కస్గంజ్‌లోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ధృవీకరించారు. నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.