
Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం
ఈ వార్తాకథనం ఏంటి
ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య కుంకీ ఏనుగుల అంశంపై ఒక ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే సమక్షంలో ఇరు రాష్ట్రాల అటవీ శాఖ అధికారుల మధ్య జరిగింది.
ఈ ఒప్పందం ప్రకారం, కర్ణాటక నుంచి 8 ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు అంగీకారం కుదిరింది.
చిత్తూరు, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో ఏనుగులు జనావాసాల్లోకి చేరడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ విషయంపై ఇటీవల పవన్ కళ్యాణ్ బెంగళూరుకు వెళ్లి, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రేతో చర్చలు జరిపారు.
కుంకీ ఏనుగులు పంపాలన్న ప్రతిపాదనకు వారు సానుకూలంగా స్పందించారు, దాని ఆధారంగా నేడు ఒప్పందం కుదిరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఒప్పందం పూర్తయ్యాక మీడియాతో మాట్లాడుతున్న పవన్
దసరా తరువాత ఆంధ్రాకు రానున్న కుంకీ
— ఉత్తరాంధ్ర జనసైన్యం (@UA_Janasainyam) September 27, 2024
ఏనుగులు ~@PawanKalyan 💥🔥👌 pic.twitter.com/Nb2Mn9vasu
వివరాలు
ఆరు అంశాలు
1. ఏనుగులకు మనుషులకు మధ్య ఎలా ఉండాలి అనే అంశం
2. మావటీలకు కావటీలకు శిక్షణ
3. కుంకీ ఏనుగులను ఏపీకి తరలింపు
4. ఏనుగుల శిబిరాల సంరక్షణ, ఆహారం
5. ఎర్రచందనం, శ్రీగంధం సమస్యలకు జాయింట్ టాస్క్ ఫోర్స్..
6. అడవులలో ఏం జరుగుతుందో రియల్ టైంలో తెలిసేలా ఐటీ అభివృద్ధి.
పవన్ మాట్లాడుతూ,ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడంలో కర్ణాటక అమలు చేసిన విధానాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.
దీనికోసం రెండు రాష్ట్రాల ప్రధాన అటవీ సంరక్షణాధికారులు కలిసి పనిచేయనున్నారని వివరించారు.
కర్ణాటకలో వంద కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం పట్టుబడిందని,స్మగ్లర్లు ఎక్కువగా తమిళనాడు నుంచి వస్తున్నారని అన్నారు.