
Chandrababu: క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం.. 25వేల ఉద్యోగావకాశాలు!
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో తొలిసారి ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీగా రూపొందించిన క్రియేటర్ ల్యాండ్‌ను ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఈ శుభపరిణామాన్ని 'ఎక్స్' వేదికపై ప్రకటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 25,000 ఉద్యోగాలను సృష్టించేందుకు ఈ ప్రాజెక్ట్ రూపొందించారని వివరించారు.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పెద్దఎత్తున అభివృద్ధి జరగడంలో ఈ ప్రాజెక్ట్ కీలకంగా మారనుందని తెలిపారు.
Details
యువతకు ఉద్యోగ నైపుణ్యాలు
ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలోని స్థానిక ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే శక్తిమంతమైన సాధనమవుతుందన్నారు.
ఈ క్రియేటర్ ల్యాండ్ ప్రపంచస్థాయి సృజనాత్మక టౌన్‌షిప్‌గా చలనచిత్రం, గేమింగ్, సంగీతం, వర్చువల్ ప్రొడక్షన్, కథల తయారీతో పాటు ఏఐ ఆధారిత కంటెంట్‌ను కేంద్రంగా తీసుకుంటుంది.
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో, గ్లోబల్ భాగస్వామ్యాలతో మన యువతకు నైపుణ్యాలు అందించడానికి క్రియేటర్‌ల్యాండ్ అకాడమీ వేదికగా పనిచేస్తుందని ఆయన తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ సృజనాత్మక, డిజిటల్ పరిశ్రమలకు ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారుతుందని ముఖ్యమంత్రి అన్నారు.