Bihar: ఎన్నికలకు ముందు..బీహార్ లో క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు.కొత్తగా ఏడు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
ఈ ఏడాది నవంబర్‌లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం నితీశ్ తన క్యాబినెట్‌ను విస్తరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
నూతనంగా నితీశ్ క్యాబినెట్‌లో చోటు దక్కిన బీజేపీ ఎమ్మెల్యేలు సంజయ్ సరోగి, సునీల్ కుమార్, జిబేశ్ మిశ్రా, మోతీలాల్ ప్రసాద్, క్రిషన్ కుమార్ మాంటూ, రాజు కుమార్ సింగ్, విజయ్ కుమార్ మండల్.
వీరంతా బుధవారం సాయంత్రం 4 గంటలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
వివరాలు
"ఒక వ్యక్తికి ఒకే పదవి" ప్రకారం దిలీప్ జైస్వాల్ రాజీనామా
ఇటీవల బీహార్ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన దిలీప్ జైస్వాల్ తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
పార్టీ "ఒక వ్యక్తికి ఒకే పదవి" అనే పాలసీ ప్రకారం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ఇప్పుడు కొత్తగా ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, జైస్వాల్ రాజీనామా చేస్తే బీహార్ మంత్రి వర్గంలో మొత్తం ఆరుగురు కొత్త మంత్రులు చేరినట్లు అవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
#WATCH | BJP MLAs Jibesh Kumar and Raju Kumar Singh take oath as Bihar ministers as CM Nitish Kumar expands his Cabinet pic.twitter.com/oWG1rRAtDm
— ANI (@ANI) February 26, 2025