LOADING...
Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత
శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత

Air India: శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ప్రయాణికుల దించివేత

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 17, 2025
08:32 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ విమానయాన రంగంలో ప్రధాన పాత్రధారిగా ఉన్న ఎయిర్ ఇండియాలో వరుస సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా మరో విమానంలో ఏర్పడిన సాంకేతిక సమస్య ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి కోల్‌కతా మీదుగా ముంబై వెళ్తున్న ఎయిరిండియా విమానం (ఫ్లైట్ నెంబర్ ఏఐ180) మంగళవారం అర్ధరాత్రి 12:45కి కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకుంది. ఈ సమయంలో విమానంలోని ఒక ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ లోపాన్ని సిబ్బంది తక్షణమే గుర్తించి అప్రమత్తంగా స్పందించారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, అధికారులు వెంటనే వారిని విమానం నుంచి కిందకి దించేందుకు చర్యలు తీసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం