LOADING...
Narendra Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! 

Narendra Modi: నేడు అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
08:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. గురువారం అహ్మదాబాద్‌లో సర్దార్‌ పటేల్‌ ఎయిర్‌ పోర్ట్‌కు సమీపంలో ఎయిర్‌ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో విమానంలోని 241 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అందరూ విమాన ప్రయాణికులే కాకుండా, ప్రమాద సమయంలో విమానం కూలిన భవనంలో ఉన్న మెడికల్‌ విద్యార్థులు కూడా మరణించినట్టు సమాచారం. అయితే విద్యార్థుల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారన్న విషయం ఇప్పటివరకు స్పష్టతకు రాలేదు. ఈ విమానంలో మొత్తం 230 మంది ప్రయాణికులు,10మంది సిబ్బంది,ఇద్దరు పైలెట్లు ఉన్నారు. విమానం అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వైపు బయలుదేరిన కొద్ది సేపటికే.. టేకాఫ్‌ అయిన 32 సెకన్లలోనే.. విమానం అక్కడి మెడికల్‌ కాలేజ్‌ హాస్టల్‌ భవనంపై కూలిపోయింది.

వివరాలు 

ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా..

విమానం కూలిన వెంటనే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ కారణంగా విమానంలోని చాలామంది దహనమయ్యారు. దురదృష్టవశాత్తు ఈ ఘోర ప్రమాదం నుండి కేవలం ఒక్క ప్రయాణికుడు మాత్రమే సజీవంగా బయటపడ్డాడు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రత్యక్షంగా ఘటన స్థలాన్ని సందర్శించి సమీక్షించనున్నారు.

వివరాలు 

మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు

విమానంలో మృతి చెందిన వారి మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో, వాటిని గుర్తించటం చాలా కష్టంగా మారింది. దీంతో మృతులను గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు తప్పనిసరి అని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఈ పరీక్షలను పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇంతలో అమిత్‌ షా ఇప్పటికే అహ్మదాబాద్‌కు చేరుకొని, ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.