LOADING...
Air India plane crash: విమాన ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం 
విమాన ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం

Air India plane crash: విమాన ప్రమాద మృతుల కుటుంబానికి రూ.కోటి పరిహారం 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2025
08:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాను నిర్వహిస్తున్న టాటా గ్రూప్ స్పందించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు గరిష్ఠంగా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియాగా అందించనున్నట్టు సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా, ఈ ప్రమాదంలో గాయపడిన వారి చికిత్సకు అయ్యే ఖర్చులను పూర్తిగా టాటా గ్రూప్ భరించనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గురువారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

వివరాలు 

క్యాంప్‌బెల్ విల్సన్ తీవ్ర విచారం

'ఈ విమాన ప్రమాదం మమ్మల్నికలచివేసింది. మేము అనుభవిస్తున్న వేదనను మాటలతో వ్యక్తీకరించలేం. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాం. వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తాం. గాయపడిన వారి వైద్య ఖర్చులు మా భాద్యత. అంతేకాకుండా, వారి సంరక్షణకూ మేమే భరోసా. బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి మా వంతు సహాయం అందించేందుకు సిద్దంగా ఉన్నాం'' అని తెలిపారు. ఇక ఈ ఘటనపై ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ), చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) క్యాంప్‌బెల్ విల్సన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టాటా గ్రూప్ చేసిన ట్వీట్