LOADING...
Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు

Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 17, 2025
12:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో PM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి. వీటి ప్రధాన కారణంగా వాహనాలు, భవన నిర్మాణ వ్యర్థాల వల్ల ఏర్పడే కాలుష్యం ఉన్నదని కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ పి.కృష్ణయ్య పేర్కొన్నారు. ఈ విషయం పై కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఏ జిల్లాల్లో ఏ రకమైన కాలుష్యం ఎక్కువగా ఉందో, దానిని నియంత్రించడానికి తీసుకోవలసిన చర్యల గురించి సిఫారసులు చేశారు.

వివరాలు 

ప్రధాన అంశాలివి.. 

ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో మైనింగ్ వ్యర్థాలను రోడ్డు పక్కన వేయడం గాలి కాలుష్యానికి ప్రధాన కారణమవుతోంది. మైనింగ్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి సిమెంట్ ప్లాంట్లు సిద్ధంగా ఉన్నాయి. వాటితో సమన్వయం చేసి వ్యర్థాలను తొలగించాలి. వాహనాల ద్వారా కలిగే కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆర్టీసీ వాహనాలు, ప్రైవేట్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా ప్రోత్సహించాలి. విజయవాడ సమీపంలోని థర్మల్ పవర్ ప్లాంట్ నుండి పెద్ద ఎత్తున ధూళి ఉద్గారాలు జరుగుతున్నాయి. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి వెంటనే సాంకేతికతను ఆధునికతరం చేసి, నియంత్రణ చర్యలు తీసుకోవాలి. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద అందుతున్న నిధులను భవన నిర్మాణ వ్యర్థాల కారణంగా ఏర్పడే కాలుష్య సమస్య పరిష్కారానికి వినియోగించాలి.