
Ambala: అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు.. ఇళ్లల్లోకి వెళ్ళిపోమంటూ ఎయిర్ ఫోర్స్ నుంచి హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో యుద్ధ పరిస్థితులను ఊహిస్తూ ఎయిర్ ఫోర్స్ అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు.
2025, మే 9వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద అధికారులు యుద్ధ సైరన్లను మోగించారు.
పాకిస్థాన్ వైపు నుంచి దాడి జరగవచ్చన్న సమాచారం నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నారు.
సైరన్ మోగించిన వెంటనే ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అందరూ తమ ఇళ్లలోకి వెళ్లిపోవాలని, కిటికీలకు దూరంగా ఉండాలని, విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపేయాలని సూచించారు.
వివరాలు
రాఫెల్ యుద్ధ విమానాల కార్యకలాపాలకూ కేంద్రంగా అంబాలా
ఈ రోజు తెల్లవారుజామున చండీఘడ్ నగరంలోనూ ఇలాంటి హెచ్చరికలతో సైరన్లు మోగించగా, ఆ తర్వాత అంబాలా ఎయిర్ ఫోర్స్ స్థావరం నుంచీ అధికారికంగా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ పరిణామాలతో రహదారులు అన్నీ ఖాళీ అయ్యాయి. ప్రజలు త్వరితగతిన ఇళ్లకు చేరిపోయారు.
అంబాలా సిటీలో ఉన్న ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పాకిస్తాన్ సరిహద్దులకు సమీపంగా ఉండటంతో ఇది వ్యూహాత్మకంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా భావించబడుతోంది.
రాఫెల్ యుద్ధ విమానాల కార్యకలాపాలకూ ఇదే కేంద్రంగా పనిచేస్తోంది.
ఈ నేపథ్యంలో అంబాలాను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ డ్రోన్‌లు లేదా మిస్సైల్‌ల ద్వారా దాడి చేయొచ్చన్న అనుమానంతో ముందస్తుగా అప్రమత్తత చర్యలు చేపట్టారు.
వివరాలు
ఏ క్షణంలోనైనా దాడి చేసే ప్రమాదం
యుద్ధ సైరన్లు మోగించడంతో పాటు, స్థానిక ప్రజలకు పలు సూచనలు, అప్రమత్తత సూచనలను ఎయిర్ ఫోర్స్ అధికారులు అందిస్తున్నారు.
ఏ క్షణంలోనైనా దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ, ప్రజలు నిరంతరం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అంబాలాలో మోగిన యుద్ధ సైరన్లు
Sirens being sounded in #Ambala cantt as a warning has reportedly been received from Air force station of possible attack. People have been advised to remain indoors and away from balconies #IndiaPakistanTensions #ambala #chandigarh @dwnews pic.twitter.com/bdsOUwzjv5
— Shalu Yadav (@StoriesByShalu) May 9, 2025