Page Loader
Revanth Reddy: కాళేశ్వరం లోపాలన్నీ వెలుగులోకి.. రెండు రోజుల్లో మీడియా సమావేశం : సీఎం రేవంత్
కాళేశ్వరం లోపాలన్నీ వెలుగులోకి.. రెండు రోజుల్లో మీడియా సమావేశం : సీఎం రేవంత్

Revanth Reddy: కాళేశ్వరం లోపాలన్నీ వెలుగులోకి.. రెండు రోజుల్లో మీడియా సమావేశం : సీఎం రేవంత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 11, 2025
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

తాను ఉన్నంతవరకూ కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కేసీఆర్ కుటుంబానికి ప్రవేశం ఉండదని. ఈ కుటుంబం రాష్ట్రానికి ప్రధాన శత్రువని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో మీడియాతో నిర్వహించిన ఓ చిట్‌చాట్ సందర్భంగా సీఎం రేవంత్ ఈ విషయాలను వెల్లడించారు. ఇటీవల జరిగిన మంత్రి మండలి విస్తరణ, శాఖల కేటాయింపుపై ఢిల్లీలో ఎలాంటి చర్చలు జరగలేదని వెల్లడించారు. హైదరాబాద్‌కు చేరుకున్న తర్వాత పార్టీ సహచరులతో సంప్రదించి శాఖల కేటాయింపులు నిర్ణయిస్తామని చెప్పారు. అలాగే, అధిష్ఠానం వద్ద కేవలం కర్ణాటక కులగణన అంశంపైనే చర్చలు జరిగినట్లు తెలిపారు.

Details

అన్ని వివరాలు బయటపెడతా

ఇక రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యం ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై రెండు రోజుల్లో మీడియా సమావేశం నిర్వహిస్తానని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు, వివరాలు బయటపెడతానని హామీ ఇచ్చారు. కేంద్రంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన రేవంత్‌ రెడ్డి, కేంద్రంలో తెలంగాణకు సంబంధించి ఏ విషయంలోనైనా అడ్డుగా నిలుస్తున్నది కిషన్‌రెడ్డేనని ఆరోపించారు. రాష్ట్రంలోని ఏ ఒక్క ప్రాజెక్టుకు అయినా ఆయన నిధులు సాధించలేకపోయారని మండిపడ్డారు.