Page Loader
Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి
కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి

Accident: కర్నూలు నుండి బిహార్ వెళుతున్న అంబులెన్సు బోల్తా.. నలుగురు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 01, 2024
05:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలు జిల్లా నుంచి బిహార్‌కు వెళుతున్న ఓ అంబులెన్స్‌ ప్రమాదానికి గురైంది. కర్నూలు నుండి బిహార్‌లోని చంపారన్‌కు రోగిని తరలిస్తుండగా, ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో అంబులెన్సు ఒక పాదచారుడిని ఢీకొట్టింది. ఆ తర్వాత అదే అంబులెన్సు స్తంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన జబల్‌పుర్-నాగ్‌పుర్ హైవే (ఎన్‌హెచ్‌ 34)పై చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.

Detaiils

క్షతగాత్రుల్ని జబల్‌పుర్‌ ఆస్పత్రికి తరలింపు

మృతుల్లో అనిష్‌ షా (18) అనే రోగిని కర్నూలు నుండి తరలించటానికి వచ్చిన ప్రమిత్‌ షా (35), ప్రిన్స్‌ షా (4), ముకేశ్‌ షా (36), సునీల్‌ షా (40) ఉన్నారు. ప్రమాద సమయంలో అంబులెన్సులో ఇద్దరు డ్రైవర్లు, అనిష్‌ షా కుటుంబం సభ్యులు ఆరుగురు ఉన్నారు. సియోని జిల్లా పోలీసులు తెలిపిన ప్రకారం, గాయపడిన వారిని జబల్‌పుర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.