Page Loader
నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా
లాలూ, నితీష్ చమురు నీరు వంటివారు,ఎక్కువ కాలం కలిసుండలేరు : అమిత్ షా

నితీష్,లాలూ పొత్తు చమురు నీరు వంటిదే, ఎక్కువ కాలం ఉండదు : అమిత్ షా

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 16, 2023
05:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీహర్‌లో కేంద్రహోం మంత్రి అమిత్ షా శనివారం పర్యటించారు. సీఎం, మాజీ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌ల పొత్తు చమురు, నీరు వంటిదని, ఎక్కువ కాలం కలిసుండలేదని జోస్యం చెప్పారు. ఝంజర్‌పూర్‌లో బహిరంగ సభలో మాట్లాడిన షా, బిహార్ వెనుకబాటుకు నితీష్‌, లాలూ ప్రసాద్‌ ఇద్దరూ బాధ్యులేనన్నారు. అవినీతిమయమైన యూపీఏ పేరు ఇష్టం లేకనే ఇండియా కూటమితో ప్రజల్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారన్నారు. దర్భంగా ఎయిమ్స్‌ను కేంద్రం రూ.1250కే ప్రతిపాదిస్తే, సీఎం నితీశ్ 81 ఎకరాల భూమిని ఇచ్చారని, తర్వాత వెనక్కి తీసుకున్నారని ఎద్దేవా చేశారు. మళ్లీ కొద్దిరోజులకు కేవలం 4 గుంటల స్థలాన్నే ఎయిమ్స్ కోసం ఇచ్చారని చురకలు అంటించారు.81 ఎకరాలను ఇచ్చి ఉంటే దర్భంగాలో వైద్య సేవలు అందేవన్నారు.

details

లాలూ జీ, యూపిఏ సర్కార్ మీకేమిచ్చింది : అమిత్ షా

మరోవైపు బీహార్‌లో పర్యాటకానికి సంబంధించి కేంద్రం చేసిన అభివృద్ధి పనులను అమిత్ షా వెల్లడించారు. సీతామర్హి, బక్స్, దర్భంగాలను రామాయణ సర్క్యూట్‌లో చేర్చిన ప్రధాని మోదీ, పర్యాటకాన్ని పరుగులు పెట్టిస్తున్నారన్నారు. మిథిలా మఖానాకు కేంద్రమే జీఐ(GI) ట్యాగ్ చేసిందని షా పేర్కొన్నారు. రూ.125 కోట్లతో దర్భంగా, సక్రి, జయనగర్‌, సమస్తిపూర్‌ రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులను సైతం నిర్వహిస్తోందన్నారు. రూ.1200 కోట్లతో పాట్నా విమానాశ్రయ పునరాభివృద్ధిని చేపట్టామని అమిత్ షా స్పష్టం చేశారు. అటల్‌జీ ప్రారంభించిన కోసి మహాసేతును UPI పెండింగ్‌లో పెడితే, మోదీ సర్కార్ పూర్తి చేసిందని చెప్పుకొచ్చారు. పదేళ్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని, బీహార్‌కు ఏం ఇచ్చారని లాలూని నిలదీశారు.