Page Loader
Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 
విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ

Amrit Bharat Station Scheme: విజయవాడ డివిజన్‌లో 11 రైల్వే స్టేషన్లకు మహర్దశ 

వ్రాసిన వారు Stalin
Jul 31, 2023
03:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్) జోన్‌లోని ఆంధ్రప్రదేశ్ విజయవాడ డివిజన్‌లోని 11 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ఎంపికయ్యాయి. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. రైల్వే స్టేషన్లను ఆధునీకరించే లక్ష్యంతో కేంద్రం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 'అమృత్ భారత్ స్టేషన్' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి రైల్వే స్టేషన్‌లో మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. అనకాపల్లి, భీమవరం టౌన్, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపెల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లు 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద ఎంపికైనట్లు విజయవాడ డివిజన్‌ ​​డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ నరేంద్ర ఆనందరావు పాటిల్‌ తెలిపారు.

ఏపీ

ప్రయాణికుల నుంచి సలహాలు కోరిన ​​డివిజనల్‌ మేనేజర్

అమృత్ భారత్ స్టేషన్ పథకం ఎంపికైన రైల్వే స్టేషన్లలో చేసే అభివృద్ధి పనులు ఇవే. ప్లాట్‌ఫారమ్ ఉపరితలం మెరుగుపర్చనున్నారు. ప్లాట్‌ఫారమ్ పొడవును పెంచనున్నారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను మెరుగుపర్చనున్నారు. 12 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు ఏర్పాటు చేయనున్నారు. లైటింగ్, ఎస్కలేటర్‌లు, లిఫ్టులు, ఫర్నిచర్‌ల ఏర్పాటు చేయనున్నారు. వీటితో మరిన్ని వరసతులను ప్రయాణికులకు అందించనున్నారు. అలాగే ఈ పథకం కింద స్టేషన్లను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై సూచనలను అందించాలని కూడా పాటిల్ ప్రయాణికులను నుంచి సూచనలు సలహాలను కోరారు. ఆగస్టు 3లోపు సూచనలను ఈమెయిల్, ట్విట్టర్ హ్యాష్‌ట్యాగ్‌ల ద్వారా పంచుకోవాలనన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర పాటిల్ చేసిన ట్వీట్