కేరళ బీచ్లో గ్యాంగ్ రేప్.. ఆశ్రమానికి వచ్చిన అమెరికా మహిళపై అఘాయిత్యం
భారతదేశంలో గ్యాంగ్ రేప్ ఘటనలు ఎక్కడో చోట ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మేరకు తాజాగా కేరళలో దారుణం జరిగింది. ఓ విదేశీ మహిళపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన కలకలం రేపుతోంది. జులై 31న ఉదయం 10.30 గంటల సమయంలో ఆశ్రమం వద్ద ఉన్న బీచ్ లో 44 ఏళ్ల అమెరికా మహిళ ఒంటరిగా కూర్చున్నారు.అదే సమయంలో అక్కడికి వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెతో స్నేహం చేశారు . అనంతరం బాధితురాలితో మంచిగా నటిస్తూ ఆమెకు మద్యం తాగించి సమీపంలోని ఓ ఖాళీ ఇంటికి తీసుకెళ్లి ఆమెపై సామూహికంగా అత్యాచారం చేశారు.ఈ క్రమంలోనే ఆగస్ట్ 1న బాధితురాలు కరుణగప్పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు.
నిందితులిద్దరూ పాత నేరస్తులే : కరుణగప్పల్లి పోలీసులు
వెంటనే స్పందించిన పోలీసులు, నిందితులను కొల్లంకు చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళకు వైద్య పరీక్షలు సైతం నిర్వహించినట్లు పోలీసులు పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే : అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన బాధిత మహిళ జులై 22న కేరళకు వచ్చారు. అక్కడ ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే జులై 31న ఆశ్రమం వద్ద ఈ అఘాయిత్యం జరిగింది. ఆగస్ట్ 5న ఆమె తిరిగి USAకి తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ ఘోరానికి ఒడిగట్టిన వ్యక్తులను జయన్, నిఖిల్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరూ పాత నేరస్తులేనని, ఇప్పటికే వారిపై అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు స్పష్టం చేశారు.