
CM Chandrababu: వామపక్ష తీవ్రవాద నిర్మూలనపై కేంద్రంతో కీలక సమావేశం.. ఇవాళ దిల్లీకి చంద్రబాబు ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ దిల్లీ ప్రయాణం కానున్నారు.
రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
ఇటీవల చత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.
2026 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా అరికట్టడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
Details
సమావేశం అనంతరం ప్రముఖులను కలిసే అవకాశం
ఈ సమావేశంలో మావోయిస్టుల నిర్మూలన, ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై చర్చించనున్నారు.
ముఖ్యంగా రహదారి, ఫోన్ కనెక్టివిటీ మెరుగుపరచడం వంటి కీలక అంశాలు చర్చకు రానున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు, ప్రాజెక్టులపై నివేదికను కేంద్రానికి సమర్పించనున్నారు.
సమావేశం ముగిసిన తరువాత, దిల్లీలోని ప్రముఖులను సీఎం చంద్రబాబు కలిసే అవకాశాలున్నాయి.