Page Loader
Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె
ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

Anakapalli : అప్పులబాధకు స్వర్ణకారుడి కుటుంబం ఆత్మహత్య.. ప్రాణాల కోసం పోరాడుతున్న చిన్న కుమార్తె

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 29, 2023
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లా అనకాపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి యత్నించిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన స్వర్ణకారుడు శివరామకృష్ణ కుటుంబం కొంతకాలంగా అనకాపల్లిలో నివసిస్తోంది. అప్పుల బాధను తట్టుకోలేక గురువారం రాత్రి కుటుంబమంతా సైనైడ్‌ తాగి బలవన్మరణానికి పాల్పడ్డట్లు స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. రుణ బాధల కారణంగా తల్లితండ్రులు, పిల్లలతో పాటు ఆత్యహత్యకు ప్రయత్నించడం ఆందోళన కలిగిస్తోంది.

DETAILS

కుటుంబంతో కలిసి అనకాపల్లిలో నివాసం ఉంటున్న శివరామకృష్ణ 

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన శివ రామకృష్ణ, స్వర్ణకారుడు. ఈ వృత్తితోనే అనకాపల్లిలో కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ క్రమంలోనే అప్పుల బాధను తట్టుకోలేక, గురువారం రాత్రి శివ రామకృష్ణతో పాటు ఆయన భార్య, ముగ్గురు ఆడపిల్లలు సైనైడ్ తాగినట్లు తెలుస్తోంది. విషప్రయోగంతో రామకృష్ణ, అతని భార్య మాధవి, కుమార్తెలు వైష్ణవి, లక్ష్మి మృతి చెందారు. మరో కుమార్తె కుసుమ ప్రియ(13) అనకాపల్లిలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు. శివరామకృష్ణ (40),మాధవి (38), కుమార్తెలు వైష్ణవి(16),లక్ష్మి(13)లు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.