Anna Canteens: అన్న క్యాంటీన్ల ప్రారంభానికి టైం ఫిక్స్ ..ప్రకటించిన మంత్రి నారాయణ
ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో క్యాంటీన్ నిర్మాణ పురోగతి,మురుగు కాల్వల పూడికతీత, తదితర అంశాలపై సమీక్షించారు. 33 మున్సిపాలిటీల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.వంటశాలల ఏర్పాట్లను పూర్తి చేయడం ప్రాధాన్యతను మంత్రి నారాయణ నొక్కిచెప్పారు. వచ్చే వారం క్యాంటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఆగస్టు 10 నాటికి 100 క్యాంటీన్లను సిద్ధం చేస్తామని,అదనంగా 83 ఆగస్టు చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఆగస్టు 15న సాయంత్ర 6.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఏర్పాటు చేయబోతున్న అన్నా క్యాంటీన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారని నారాయణ తెలిపారు.